Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారిస్తే తప్పేంటి.?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారిస్తే తప్పేంటి.?

- Advertisement -

– టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ 
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం పట్ల ఖండన 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
టెలిఫోన్ టాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తే తప్పేంటని, తప్పు చేయనప్పుడు బిఆర్ఎస్ నాయకులకు భయం ఎందుకని? చట్టానికి ఎవరు అతిథులు కారని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసిఆర్ ను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని, కేసిఆర్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి ఆత్మ అభిమానాన్ని ఎవరు కాలరాశారో టెలిఫోన్ ట్యాపింగ్ రూపంలో తెలిసిపోయిందన్నారు.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిఆర్ఎస్ పాలనను బొందపెట్టి, మీ దిష్టిబొమ్మలను తెలంగాణ ప్రజలు పాతాళ లోకంలో పెట్టారన్నారు.అయినా బుద్ది లేకుండా ప్రజా పాలన పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై  అర్థము లేని విమర్శలు చేస్తున్నారన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎంతమంది నాయకుల్ని రాజకీయంగా వేధించారో మీకు తెలియదా? అన్నారు.మీ పాలనను, మీ అవినీతిని ప్రశ్నించినందుకు జర్నలిస్టులను, ఉద్యమకారులను తలుపులు బద్దలు కొట్టి రాత్రికి రాత్రి ఎత్తుకపోయారన్నారు. ఆ దొరతనపు అహంకార పాలనను తెలంగాణ ప్రజలు మరిచిపోరని పేర్కొన్నారు.

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 400 మంది నాయకులది, వ్యాపారవేత్తలది, సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. సాక్షాత్తు కేసిఆర్ కుతురి భర్తదే ఫోన్ ట్యాపింగ్ చేసారని స్వయంగా కవితనే బహబాటంగా చెప్పారని, ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలని ప్రశ్నించారు. సినీ తారలతోపాటు కుటుంబ సభ్యుల వ్యక్తిగత హక్కులను కాలారసారని, దొంగ చాటున ఫోన్లు వినే హక్కు మీకెవరిచ్చారన్నారు. కేటీఆర్ ఏమో చేసే గీస్తే రెండు మూడు ఫోన్లు ట్యాప్ అయ్యిండొచ్చు దానికి ఇంత పెద్ద రాదాంతమా అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. టెలిఫోన్ టాపింగ్ రూపంలో వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే విదంగా వ్యవహరించిన వాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు.

 పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వ్యవస్థలను సర్వనాశనము చేశారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్, వేములవాడ జగదీష్, దాసరి రాకేష్, నల్ల సాయికుమార్, కిషన్ గౌడ్, పూజారి శేఖర్, పాషా, ముత్యాల చంద్రకాంత్, పీర్ల అరవింద్, ఎడ్ల దీపక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -