నవతెలంగాణ – మిడ్జిల్
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఆదివారం జడ్చర్ల కల్వకుర్తి ప్రధాన రహదారిపై దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పాండు, బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం పరిపాలన చేతగాక ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి రాబోవు రోజులే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధించిన ఉద్యమ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు ఇవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు, సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



