Sunday, February 1, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. నినాదాలతో దద్దరిల్లిన బాల్కొండ

సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. నినాదాలతో దద్దరిల్లిన బాల్కొండ

- Advertisement -

మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు 
నవతెలంగాణ – బాల్కొండ

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీట్ విచారణకు వ్యతిరేకంగా ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుంచే బీఆర్‌ఎస్ నాయకులు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ నిరసనలు తెలిపారు. అనంతరం మండల కేంద్రానికి చేరుకొని అంబేద్కర్ చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో పట్టణ వీధుల్లో బిఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వన్నెల్ బి ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు. నిరసనలో భాగంగా బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం బిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, తన పరిపాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు కేసీఆర్‌పై తప్పుడు కేసులు పెడుతూ నోటీసులు జారీ చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిపై ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు దిగుతోందని అన్నారు. ఇలాంటి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్ధం ప్రవీణ్ రెడ్డి,నాయకులు దాసరి వెంకటేష్, ఇఫ్తేఖారోదిన్, బుస నరహరి, గాండ్ల రాజేష్, రామరాజు గౌడ్, ఫయాజ్, సాగర్ యాదవ్, శరత్, కన్న పోశెట్టి, గోవర్ధన్ గౌడ్, స్వామినాథ్, శ్రీనివాస్, బాలరాజ్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -