నవతెలంగాణ – కాటారం
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సిట్ విచారణ పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని బిఆర్ఎస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ అన్నారు. సిట్ విచారణను వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ పార్టీ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఫోన్ టాంపరింగ్ పేరుతో బిఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా భయపడే పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు లేరనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ పై ఎన్నో అక్రమ కేసులు పెట్టినప్పటికీ భయపడని ఉక్కు గుండె మా నాయకుడని అన్నారు. కెసిఆర్ అంటే వ్యక్తి కాదని ఒక శక్తి అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావడం కష్టంగా మారడంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి, బిఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అన్నారు.అనంతరం పోలీసులు పోలిష్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ కిరణ్, కాటారం సర్పంచి పంతకాని సడవలి, ఉప సర్పంచ్ కొండ గొర్ల బాణేష్, కొండ గొర్ల వెంకటస్వామి, ఊర వెంకటేశ్వరరావు, గాలి సడవలి, గంట సమ్మయ్య,షేక్ మున్వర్, మాణెం రాజబాబు, ఆయిలి రాజబాబు, మేడిగడ్డ దుర్గారావు, బాసాని రవి, చీమల వంశీ, గాజుల విక్రం, కొండపర్తి రవి, జాగరి ఓరల్, జాగిరి మహేష్, పోత సంతోష్, కొండ తిరుపతి, రామిల రాజు, మాదాసు మొండయ్య, వంగల రాజేంద్ర చారి, అజ్మీరా దేవా, గంట శ్రావణ్, దేవేందర్,ఉప్పు సంతోష్, శంకర్, బండం రాజు తదితరులు ఉన్నారు.



