Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా స్థంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 

ఘనంగా స్థంభగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని సరంపేట గ్రామంలోని శ్రీ స్తంభగిరి  లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలోనే జరిగే అతిపెద్ద జాతర కాబట్టి గ్రామ ప్రజలతో పాటు,మండల పరిసర ప్రాంత ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహ,పలు గ్రామాల సర్పంచులు,వార్డు మెంబర్లు,ఆయా పార్టీల నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు వర్కా ల వెంకటేష్,రమేష్ నరసింహ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -