Monday, May 26, 2025
Homeతెలంగాణ రౌండప్తూప్రాన్ డీఎస్పీగా నరేందర్ గౌడ్ ..

తూప్రాన్ డీఎస్పీగా నరేందర్ గౌడ్ ..

- Advertisement -

నవతెలంగాణ – తూప్రాన్: తూప్రాన్ నూతన డిఎస్పీగా జె.నరేందర్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత డిఎస్పీ సోమ వెంకటరెడ్డి నూతన డీఎస్పీగా బదిలీపై వచ్చిన జె.నరేందర్ గౌడ్ కు  పదవి బాధ్యతలు అప్పగించారు. నూతన డీఎస్పీ గతంలో రాచకొండ కమాండ్ కంట్రోల్ ఏసీపీగా పనిచేశారు. తూప్రాన్ నుండి బదిలీపై వెళ్లిన సోమ వెంకటరెడ్డి ప్రమోషన్ పై సైదాబాద్ ఏసీపీగా వెళ్లారు. ఈ సందర్భంగా డిఎస్పి వెంకట్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ రంగకృష్ణ, ఎస్సై జి. శివానందం, డీఎస్పీ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -