బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మాజీ సీఎం కేసీఆర్ పై అక్రమ కేసులు సరికాదని భువనగిరి జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, మాట్లాడారు. కెసిఆర్ పై అక్రమంగా కేసులు బనాయిస్తున్న చేతగాని సిఎం రేవంత్ రెడ్డి అని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి డెవర్స్ రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అక్రమ కేసులను కఠిన ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పై అక్రమ కేసులు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



