Sunday, February 1, 2026
E-PAPER
Homeజిల్లాలుమునుగోడులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

మునుగోడులో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
కెసిఆర్ పై కక్షపూరిత రాజకీయంగా రేవంత్ రెడ్డి వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడుతూ ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందుల సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వచ్చిన రాష్ట్రంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించాలని అహర్నిశలు కృషిచేసిన కేసీఆర్ ను అవమానపరిచే విధంగా తప్పుడు కేసులు తిట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కొనే శక్తి లేక ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని వ్యక్తం చేశారు. కెసిఆర్ మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన వజ్రంలా ఉంటాడు తప్ప ఇలాంటి కేసులకు బెదిరే నాయకుడు కేసీఆర్ కాదని అన్నారు. కెసిఆర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ వేసిన సిట్ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం ఖాయమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, పోలగోని సైదులు గౌడ్, జంగిలి సాంబయ్య, గజ్జల బాలరాజ్, అయితగోని విజయ్, ఎడవెల్లి సురేష్, వరంగంటి శంకర్, ఈద శరత్ బాబు, దోటి కరుణాకర్, బండారి శ్రీను, కందుల రాజు, బోయపర్తి సైదులు, పూల వెంకన్న, బోయపర్తి సురేందర్, పందుల సురేష్, బొల్లు సైదులు, పందుల రాజేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -