నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తూ సీట్ విచారణకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంఛార్జి పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆందోళన, నిరసన కార్యక్రమాన్నీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ప్రజలపై చేస్తున్న అరాచకాలపై నినాదాలు చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేసి కొయ్యుర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, యాదగిరి రావు తోపాటు పలువురు పాల్గొన్నారు.
మల్హర్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



