బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ ను విచారించడం సరికాదని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణను నిరసిస్తూ తంగళ్ళపల్లి మండల కేంద్రం తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బిఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. సారంపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నిస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని దిష్టిబొమ్మను తీసుకెళ్లారు. దీంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఎస్సై ఉపేంద్ర చారి నాయకులతో మాట్లాడి సముదాయించారు.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;



