జాతీయ, ఓలంపిక్ స్థాయిలో తెలంగాణ యువకులు రాణించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం
మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్
నవతెలంగాణ – చిన్నకోడూరు
గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు జాతీయ ఒలంపిక్ స్థాయిలో రాణించాలన్నదే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని అందుకోసమే మండల స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో సీఎం కప్పు క్రీడల పోటీలను నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసం మహేందర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అల్లిపురం గ్రామంలో మహంకాళి శ్రీకాంత్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ 4వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మీసం మహేందర్ యాదవ్ పాల్గొని గెలిచిన టీం కి తన సొంత నిధులతో రూ.10000 వేల ఫ్రైజ్ మని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై చంద్రమోహన్ మాట్లాడుతూ యువకులకు క్రీడాలతోనే మానసిక ఉల్లాసం ఉంటుందాన్నారు. గెలిచిన టీం కు అభినందనలు తెలియజేసి ఒడిపోయిన టీం సభ్యులు అధైర్యం పడవద్దని ఓటమి గెలుపుకు తొలిమెట్టు మళ్ళీ ప్రయత్నం చేసి గెలువాలన్నారు అల్లిపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాలతోనే మానసిక ఉల్లాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



