నవతెలంగాణ-హైదరాబాద్: ప్రొ కె.నాగేశ్వర్ పై అరెస్టు నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపై, సమాజంలోని సమస్యలపై విమర్శనాత్మకంగా స్పందిస్తూ ప్రజాస్వామ్య చర్చలకు దోహదపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం ఆయన అభిప్రాయాలను గౌరవించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిపై రాజకీయ భావోద్వేగాల నేపథ్యంలో కేసులు పెట్టడం, అరెస్టు ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. విమర్శలను ఎదుర్కొనే బదులు కేసులు, అరెస్టులతో భయపెట్టే ధోరణి సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా నారా చంద్రబాబు జోక్యం చేసుకొని ఈ వివాదానికి ముగింపు పలకాలని, కేసుల పేరుతో కొనసాగుతున్న వేధింపులను నిలిపివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది
ప్రొ కె.నాగేశ్వర్ పై అరెస్టు సరికాదు: ఎస్‌ఎఫ్‌ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



