నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో బి.ఆర్.ఎస్ నేతలు నిరసన
బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్
ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు
నవతెలంగాణ – నెల్లికుదురు
సీట్ పేరుతో తెలంగాణను సాధించిన కెసిఆర్ ను విచారణకు పిలవడం సరైనది కాదని బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేన్నాకుల శ్రీనివాస్, వర్కింగ్ మండల ప్రెసిడెంట్ యాసం రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ పార్టీ నేతలు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు హాజరై మాట్లాడుతూ.. తెలంగాణను సాధించేందుకు కేసిఆర్ ప్రాణాలను లెక్క సైతం చేయకుండా ఉద్యమాలు చేసి తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో సాహసం చేసి తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ ఈరోజు ఏదో పేరుతో విచారణకు రమ్మనడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చెందారు.
కెసిఆర్ చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ఉందని అన్నారు. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కల్లబొల్లి మాటలతో కాలయాపన చేసింది తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయక విఫలం చెందుతూ ఏం మాట్లాడాలో అర్థం లేక ఈరోజు కేసీఆర్ కుటుంబం పై మండిపడుతున్నారని అది సమంజసం కాదని అన్నారు. గ్రామాలలో కార్యకర్తలు సైనికుల యొక్క ఉన్నారని ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. నెల్లికుదురు ఎస్సై చిరా రమేష్ బాబు రహదారులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని నిరసన కార్యక్రమాన్ని వివరింపజేశారు.
108 వాహనం పంపడం
మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న క్రమంలో 108 వాహనం వస్తుంటే వెంటనే అట్టి కార్యకర్తలను అడ్డు ఉన్న వాహనాలను తొలగించి పోలీసులు చాకచక్యంతో ప్రాణాలను కాపాడాలని ఉద్దేశంతో 108 వాహనాన్ని నెల్లికుదురు ఎస్సై ఇచ్చి బాబు ఆధ్వర్యంలో వాహనాన్ని తరలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి శ్రీనివాస్, నరసింహ, ఎర్రబెల్లి నవీన్ రావు, పులి రామచంద్రు, వీరగాన్ని మల్లేశం గౌడ్ , వారి పల్లి వెంకట్, మంద అశోక్, ఆకుల జగ్గయ్య,, పాశం రమేష్, బోళ్ళు మురళి, ఎండి రహిమాన్, గుగులోతు భోజ్యా నాయక్ బొల్లెపల్లి శ్రీనివాస్, రాధికా రమేష్, మధుసూదనా చారి, తోపాటు వివిధ గ్రామాల తో పాటు వివిధ గ్రామాల ఆ పార్టీ సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



