- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందించే కల్యాణ లక్ష్మి పథకం చెక్కులు మంజూరు కావడానికి మీ కృషి ఫలితమే మా కుటుంబాలకు చెక్కులు మంజూరు అయ్యాయని మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామ లబ్ధిదారులు ఆనందం వ్యక్తపరిచారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైన లబ్ధిదారులకు ఆ గ్రామ సర్పంచ్ పార్వతీ బాయి, కుమారుడు దత్తు పటేల్, అలాగే ఉపసర్పంచ్ సంగీత కుటుంబ సభ్యులు అఖిల్ లబ్ధిదారులకు ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



