Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన కేసీఆర్‌ సిట్ విచారణ

ముగిసిన కేసీఆర్‌ సిట్ విచారణ

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న నివాసంలో రెండవ అంతస్తులోని ఓ గదిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమవ్వగా.. నాలుగు గంటల 50 నిమిషాలపాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను కేసీఆర్ ముందు ఉంచి విచారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆ పెద్దాయన మీరేనా? అని సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -