- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ నేతన్న చౌక్ రగుడు చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. అలాగే అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఇలాంటి పనులు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సరైన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి ఎన్నికల ఇన్చార్జ్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



