నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో ఆదివారం బొడ్రాయి దగ్గర మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో 10 వ వార్డుకు చెందిన బిల్లా రాములు, బండారు వెంకయ్య ,బిల్ల శ్రీను, బండారు సుబ్బయ్య ,బండారు సాంబయ్య మరో 60 మంది స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వారికి కండువా వేసి సాధారణంగా ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ ,బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి పోరెడ్డి జయ శ్రీనివాస్, మైనార్టీ నాయకులు ఎండి గోరెమియ, మాణిక్యాల ఈశ్వర్ ,రామ్మూర్తి, తోట భాస్కర్, బండారు రాజశేఖర్ , శీలం రామకృష్ణ, తోట సుబ్బారావు పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ ప్రభుత్వ విప్పు సునీత సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


