Tuesday, May 26, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ తొలి క్వాలిఫయర్.. టాస్ గెలిచిన గుజ‌రాత్

ఐపీఎల్ తొలి క్వాలిఫయర్.. టాస్ గెలిచిన గుజ‌రాత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌(ఐపీఎల్‌)లో తొలి క్వాలిఫ‌య‌న్ మ్యాచ్ ప్రారంభమైంది. ధర్మశాలలో రాయల్‌ ‌చాలెంజర్స్‌, టైటాన్స్‌ ‌తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈక్ర‌మంలో టాస్ గెలిచిన జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ఐపీఎల్‌19 ‌సీజన్‌ ఆరంభం నుంచి నిలకడగా విజయాలు సాధిస్తూ ఆకట్టుకున్న జట్టు రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు. లీగ్‌ ‌దశ ప్రథమార్థం ఆఖర్లో బెంగళూరు చేతిలో ఓటమితో సంప్రదాయ ఆటతీరుకు స్వస్తి పలుకుతూ వరుస విజయాలు సాధించిన జట్టు గుజరాత్‌ ‌టైటాన్స్‌. ఇప్పడు ఈ రెండు జట్లు ఫైనల్లో చోటు కోసం నేడు క్వాలిఫయర్‌1‌లో పోటీపడుతున్నాయి. బ్యాట్‌‌తో, బంతితో దుర్బేద్యంగా కనిపిస్తున్న రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు నేడు ఫేవరేట్‌‌గా బరిలోకి దిగుతోంది.

పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలిచిన రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు, గుజరాత్‌ ‌టైటాన్స్‌‌లు ఫైనల్‌‌కు చేరుకునేందుకు రెండు అవకాశాలను దక్కించుకున్నాయి.ఈ మ్యాచ్‌‌లో ఓడినా.. ఫైనల్‌‌కు చేరుకునేందుకు క్వాలిఫయర్‌2 రూపంలో మరో అవకాశం ఉంటుంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -