Monday, May 26, 2025
Homeట్రెండింగ్ న్యూస్నాదినాది.. నాదే ఈ లోకమంతా..కుబేర టీజర్ వచ్చేసింది.. 

నాదినాది.. నాదే ఈ లోకమంతా..కుబేర టీజర్ వచ్చేసింది.. 

- Advertisement -

వతెలంగాణ-హైదరాబాద్ : నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. జూన్ 20న మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లోఎక్కడా డైలాగులు లేకుండా.. నాదినాది.. నాదే ఈ లోకమంతా అనే పాటతో కట్ చేశారు. దాదాపు రెండు నిముషాల పాటు ఈ టీజర్ నిడివి ఉంది. ఇందులో పాత్రల స్వభావాన్ని చూపించాడు. చూస్తుంటే డబ్బు, భావోద్వేగాలు, మానవ విలువలు అనే కాన్సెప్టుతో తీస్తున్నట్టు అర్థం అవుతోంది.

నాగార్జున, ధనుష్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. ధనుష్ ఓ సారి రిచ్ పర్సన్ గా.. ఇంకోసారి బిచ్చగాడి రూపంలో కనిపిస్తున్నాడు. నాగార్జున మాత్రం ఏదో కేసులో ఇరుక్కున్నట్టు చూపించారు. రష్మిక, ధనుష్ ఇందులో భార్య, భర్తలుగా కనిపిస్తున్నారు.

ఆ సిచ్యువేషన్లకు తగ్గట్టు నాది నాది నాదే ఈ లోకమంతా అన్నట్టు పాటను ప్లే చేశారు. ఈ పాటను బట్టి చూస్తే.. మనిషి ఆశలు, స్వార్థం ఎంత వరకు వెళ్తున్నాయో ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ధనుష్, నాగార్జున పాత్రల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ప్రమోషన్లు పెంచబోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -