Monday, May 26, 2025
Homeట్రెండింగ్ న్యూస్మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన

మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఇవాళ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాంలోని కొన్ని ప్రాంతాలు, మణిపూర్‌, నాగాలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలకు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక వద్ద ఉన్న అల్పపీడనం ఇవాళ ఐఎస్‌టీ వద్ద కొనసాగుతోందని పేర్కొంది.

ఇది రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -