Monday, February 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కేసు నమోదు

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కేసు నమోదైంది. తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఎర్రబెల్లి సహా మరో 33 మందిపై కేసు ఫైల్ చేశారు. BNS 189(2), 223, 126(2), 132, r/w 190 కింద కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో నిన్న ఖమ్మం-వరంగల్ హైవేపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -