Monday, February 2, 2026
E-PAPER
Homeఆటలుపాక్‌కు ఐసీసీ 48 గంటల డెడ్‌లైన్..

పాక్‌కు ఐసీసీ 48 గంటల డెడ్‌లైన్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. భారత్‌తో ఈ నెల‌ 15న జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంతో జై షా నేతృత్వంలోని ఐసీసీ తీవ్రంగా స్పందించింది. తమ నిర్ణయాన్ని 48 గంటల్లోగా మార్చుకోకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది.

టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించి, దాని స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడంతో ఈ వివాదం మొదలైంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో జరిగే ప్రపంచ కప్‌లో తమ జట్టు పాల్గొంటుందని, అయితే భారత్‌తో మాత్రం మ్యాచ్ ఆడబోదని పాక్ ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. దీనిని ‘సెలెక్టివ్ పార్టిసిపేషన్’ (పరిమిత భాగస్వామ్యం)గా పేర్కొంది. పీసీబీ తన వైఖరిని మార్చుకోకపోతే ఎదుర్కోబోయే ఆంక్షలు తీవ్రంగా ఉండొచ్చని తెలుస్తోంది. పాకిస్థాన్‌ను అన్ని అంతర్జాతీయ క్రికెట్ పోటీల నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడం, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో విదేశీ ఆటగాళ్లు ఆడకుండా ఎన్ఓసీలను నిలిపివేయడం, ఐసీసీ నుంచి ఏటా అందే సుమారు 34.5 మిలియన్ డాల‌ర్ల నిధులను స్తంభింపజేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -