- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :అమెరికా పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 2.50 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సీఎంకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సర్టిఫికెట్ కోర్సు నిమిత్తం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
- Advertisement -



