- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎకనామిక్స్ అధ్యాపకురాలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ మోచి సిద్ధలక్ష్మి స్థూల అర్థశాస్త్రం బిఎ రెండో సెమిస్టర్ లోని రెండో యూనిట్‌ను నల్గొండ ఎకనామిక్స్ ఫోరం, అక్కినపల్లి మీనయ్య ప్రధాన సంపాదకులు ఆధ్వర్యంలో పుస్తకాన్ని రచించినారు. సోమవారం ఈ పుస్తకాన్ని మద్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమానికి మద్నూర్ జూనియర్ కళాశాల ఎకనామిక్స్ అధ్యాపకులు పి.శ్రీనివాస్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
- Advertisement -



