మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్
నవతెలంగాణ – ఆలేరు టౌను
గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యంగా మారిందని, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం సోమిరెడ్డి గార్డెన్లో ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపు కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వివరించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వము పైన వ్యతిరేకత ప్రజలలో చాలా ఉందని చెప్పారు. సిట్ కు కేసీఆర్ ను పిలవడం కక్ష సాధించడమేనని పేర్కొన్నారు. తిరిగి ఆలేరు మున్సిపల్ చైర్మన్ ను కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కుండే సంపత్, బొట్ల పరమేశ్వర్, వసుపరి శంకరయ్య, మదాని ఫిలిప్, బిఆర్ఎస్ పార్టీ ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల అభ్యర్థులు 1 పాకాల మౌనిక హరీష్, 2 మోతే కనకమ్మ వెంకటేష్, 3 యాట శివ, 4. బీజని కళ్యాణి మధు, 5. మొరిగాడి మాధవి వెంకటేష్, 6. రాయపురం శ్రీనివాస్, 7 బింగి లతా రవి, 8 పాశికంటి శ్రీనివాస్, 9. కందుల బాబు, 10 పోరెడ్డి జయ శ్రీనివాస్, 11 పంతం కృష్ణ, 12. మోర్తాల సునీత రమణారెడ్డి, నాయకులు వస్పరి శంకరయ్య, కందుల శంకర్, కోర్కోపుల కిష్టయ్య, జంపాల దశరథ, ఎ సి రెడ్డి మహేందర్ రెడ్డి, కర్రే అశోక్, గిరిరాజు వెంకటయ్య, బేతి రాములు, జల్లి నరసింహులు, జుగంటి పెద్ద ఉప్పలయ్య, జూకంటి ఉప్పలయ్య, ఎండి మదార్ ,ఎండి జమాల్, క్యాసగల అనసూయ, చింతకింది చంద్రకళ, మొరిగాడి ఇందిరా, సీసా మహేశ్వరి, యాట విజయలక్ష్మి, ముళ్ల కళ కవిత పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



