Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేవెళ్ల పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా డప్పు రమేష్ పాల్

చేవెళ్ల పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా డప్పు రమేష్ పాల్

- Advertisement -

నవతెలంగాణ – మొయినాబాద్
చేవెళ్ల నియోజకవర్గం పాస్టర్స్ కమిటీ అధ్యక్షుడిగా డప్పు రమేష్ నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ, చర్చి అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయనను ఈ బాధ్యతకు ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం డప్పు రమేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చర్చి అభివృద్ధి, ప్రార్థనల నిర్వహణ, సామాజిక సేవ కార్యక్రమాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

అలాగే నియోజకవర్గంలోని 5 మండలంలోని పాస్టర్లను  సమన్వయం చేసుకుంటూ, ఐక్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. పాస్టర్ స్  ఆధ్వర్యంలో విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు, ఫాస్టర్ కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -