శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి సేవ చేయడమే లక్ష్యం
శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ ఓర్సు సమ్మయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామానికి చెందిన వృద్ధుడు చెట్ల ముత్తయ్య(102) మృతిచెందగా ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించినట్లు శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ ఓర్సు సమ్మయ్య తెలిపారు. సోమవారం ఆ గ్రామ ఉప సర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తో కలిసి మృతి చెందిన కుటుంబాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులు చట్ల లక్ష్మయ్య చెట్ల నరసయ్య ను పరామర్శించి ధైర్యం నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. మృతి చెందిన చట్ల ముత్తయ్య గ్రామంలోని అందరితో కలియతిరిగి గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు.
ఆయన మృతి గ్రామానికి తీరనిలోటు అని తెలిపారు. మృతి చదిన కుటుంబానికి అండగా ఉండి వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు మా వంతు సహాయం అందిస్తామని తెలిపారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటి నుండి గ్రామంలో ఎవరు చనిపోయిన ప్రతి చనిపోయిన కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెరుమాళ్ళ ఉపేందర్ గౌడ్, ట్రస్టు నిర్వాహకులు చిర్ర శ్రీనివాస్ గౌడ్, దండంపెల్లి వెంకట సాయిలు, బత్తిని అజయ్ గౌడ్ , శివార్ల నాగేష్ బాబు , ఏర్పుల బిక్షపతి, ఏర్పుల వేణు, ఏర్పుల సరేష్, శివార్ల కొమురయ్య, అల్లం వీరయ్య, చెట్ల రవీందర్, చట్ల వెంకన్న, చట్ల కృష్ణ, చట్ల కొమురయ్య, చట్ల యాకయ్య పాల్గొన్నారు.


