నవతెలంగాణ – ఉప్పునుంతల
మండలంలోని రాయిచెడ్ గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ప్రజా కళాకారుడు కామ్రేడ్ కేశమాని నాగయ్య గౌడ్ సంతాప సభ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్య నాయక్ మాట్లాడుతూ, కామ్రేడ్ నాగయ్య గౌడ్ మరణం గ్రామ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు.
కామ్రేడ్ నాగయ్య గౌడ్ ప్రజా కళాకారుడిగా, ప్రజల సమస్యలను పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. సీపీఐ(ఎం) రాయిచెడ్, కంసాన్పల్లి గ్రామాల్లో పార్టీ నిర్మాణం, పార్టీ విస్తరణ కోసం నిరంతరం కృషి చేసిన అంకితభావ నేతగా గుర్తింపు పొందారని అన్నారు.
ఈ సంతాప సభలో అచ్చంపేట మండల పాలసీత లీకరణ చైర్మన్ నర్సయ్య యాదవ్, సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి గొడుగు వెంకటయ్య, సీనియర్ నాయకులు గొడుగు చంద్రయ్య, సింగారం గ్రామ నాయకులు చిన్న అంజనేయ, మండల కార్యదర్శి చింతల నాగరాజు, అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు, సీనియర్ నాయకులు మాచర్ల కిష్టయ్య, కంసనిపల్లి శాఖ కార్యదర్శి మాచర్ల రామస్వామి, నాయకులు ముద్దమల్ల వేణు పాల్గొన్నారు.
అలాగే కామ్రేడ్ నాగయ్య గౌడ్ కుమారులు కేశమోని గణేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పర్వతాలు, సింగిల్ విండో డైరెక్టర్ బోడ లింగమయ్య, గొడుగు బాలయ్య, మాజీ వార్డు మెంబర్ సైదులు, డీవైఎఫ్‌ఐ గ్రామ నాయకులు గొడుగు రామకృష్ణ తదితరులు హాజరై నివాళులు అర్పించారు.



