సప్పిడి సంజన రెడ్డి.. ఉప సర్పంచ్ ల ఫోరం ములుగు జిల్లా అధ్యక్షురాలు
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ములుగు జిల్లా ఉపసర్పచ్చుల ఫోరం అధ్యక్షురాలు సప్పిడి సంజన రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పసర గ్రామంలో సంజన రెడ్డి మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లా ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫోరం ఐక్యతకు కృషిచేసి మంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా సంఘటితంగా ముందుకు సాగుదామని అన్నారు.
సంజన రెడ్డిని అభినందించిన మంత్రి సీతక్క
ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన పసర గ్రామ ఉపసర్పంచ్ సప్పిడి సంజనా రెడ్డిని మంత్రి సీతక్క అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సంజన రెడ్డిని సన్మానించి మాట్లాడారు. చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం ఉపసర్పంచిగా ఎన్నిక కావడం జిల్లా స్థాయిలో ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఒక లీడర్ కు లభించిన గొప్పతనమని సీతక్క అన్నారు. ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలను సాధిస్తూ అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నానని అన్నారు.



