మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరు కుళ్ళ క్రాస్ వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వాసులు మేడారం జాతరకు వెళ్ళి వస్తుండగా నీరు కుళ్ళ క్రాస్ వద్ద ముందు ప్రయాణిస్తున్న టిప్పర్‌ను బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో బొలెరోలో డ్రైవర్ పక్కనున్న బోడ శేఖర్(28) అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. అదేవిధంగా శేఖర్ పక్కనున్న బుర్ర శివ, జిల్ల ప్రవీణ్ లకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే బొలెరోలో మిగిలిన ఐదుగురు వ్యక్తుల పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతుడు శేఖర్ ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



