- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ అంబెడ్కర్ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాలతో రాష్ట్ర కమిటీ సభ్యులు ఇందారపు ఎల్లారి, యు.రాములు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో సోమవారం తెలంగాణ అంబెడ్కర్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా నియామకం చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఇందారపు సధి, ఉపాధ్యక్షుడుగా దేవరకొండ రాజయ్య, ప్రదాన కార్యదర్శి ఇందారపు కుమార్, కోశాధికారిగా ఇందారపు రాజయ్య తోపాటు కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం గ్రామ సర్పంచ్ బండి స్వామిని ముఖ్యదితిగా ఆహ్వానించి అంబెడ్కర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కవ్వంపల్లి పర్వతాలు, బూడిద సారయ్య, శంకర్, పిరయ్య పాల్గొన్నారు.
- Advertisement -



