నవతెలంగాణ – ఆత్మకూరు
గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి ప్రపంచ స్థాయి చాంపియన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో “ఫ్రమ్ రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్స్ 2025-26” నినాదంతో సీఎం కప్ 2వ ఎడిషన్ క్రీడా పోటీలను ఆత్మకూరు మండల కేంద్రంలో జిల్లా ఉన్నత పాఠశాలలో క్రీడాస్థలంలో సోమవారం ఘనంగా ప్రారంభించినట్లు క్రీడల మండల అధ్యక్షులు, ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం మంగళవారం రెండు రోజులు క్రీడల పోటీలు జరగనున్నాయి. మొదటిరోజు మండల స్థాయి పోటీల్లో ఆత్మకూరు మండలం 16 గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమం గ్రామస్థాయి ప్రతిభలను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా మెరిసేలా చేస్తుందని తెలిపారు.
ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి, మండల విద్యాధికారి ఎన్.విజయకుమార్, జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు మతి పి.నిర్మలకుమారి, ఎస్జీఎఫ్ఐ సెక్రెటరీ మతి ఎస్.రజిత, సభ్యులు శంకర్, సురేష్, శ్రీలక్ష్మి, సుమలతలు పాల్గొన్నారు. సోమవారం జరిగిన వాలీబాల్ పోటీల్లో బాలుర విభాగంలో ఆత్మకూరు 1వ స్థానం, అక్కంపేట 2వ స్థానం; బాలికల విభాగంలో తిరుమలగిరి 1వ స్థానం, పెద్దాపూర్ 2వ స్థానం సాధించాయి. ఖో-ఖోలో బాలుర విభాగంలో అక్కంపేట 1వ, ఆత్మకూరు 2వ స్థానాలు; బాలికల విభాగంలో పెద్దాపూర్ 1వ, ఆత్మకూరు 2వ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేసి భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.



