Monday, February 2, 2026
E-PAPER
Homeఖమ్మంఎన్నికల నియమావళికి విరుద్ధంగా కాంగ్రెస్ అభ్యర్ధుల నామినేషన్లు 

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కాంగ్రెస్ అభ్యర్ధుల నామినేషన్లు 

- Advertisement -

– అయినా తిరస్కరించని ఆర్ఓ లు 
– నామినేషన్ లో తప్పుడు సమాచారం పై కోర్టు కు వెళ్తాం
– మున్సిపాలిటీ ఎన్నికల కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధంగా కాంగ్రెస్ అభ్యర్ధులు నామినేషన్ లు దాఖలు చేసినప్పటికీ ఎన్నికలు అధికారులు వాటిని తిరస్కరించకుండా ఆమోదించడం పై బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేసారు. సోమవారం బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్ధిని కాసాని చంద్రమోహన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ లో తప్పుడు సమాచారం పై పిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు అని అన్నారు. దీనిపై కోర్ట్ కు అయినా వెళ్తాం అని అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ అయ్యేందుకు ప్రతిపాదనలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే నని,కెసిఆర్ చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది అన్నారు.100 రోజుల్లో 6 గ్యారంటీ లు అమలు చేస్తామని చెప్పిన మంత్రి మల్లు భట్టి విక్రమార్క 25 నెలలైనా సాకులు చెబుతూనే ఉన్నారు అని ఎద్దేవా చేసారు.

కెసిఆర్ అంటేనే నమ్మకం భరోసా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పదేళ్లు అలాగే సాగింది అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పీఠం ను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న 100 రోజుల్లోనే కోతుల బెడదను నివారిస్తాం అని హామీ ఇచ్చారు. అశ్వారావుపేట రింగ్ రోడ్ లో గుంతలను చూస్తే భయమేస్తుంది అని, అధ్వానమైన రోడ్లపై నిండు గర్భిణీలు ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. అశ్వారావుపేట రింగ్ రోడ్డు దుమ్ములో గంట నిలబడితే ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు పట్టలేని పరిస్థితి ఉందని వాపోయారు.

అధికార దుర్వినియోగం తో బీఆర్ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు అన్నారు.ప్రభుత్వ అధికారులకు చట్ట ప్రకారం బాధ్యతలు నిర్వహించాలి అని,పరిధి దాటి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్ అనుకూలంగా పనిచేసిన అధికారులను రిటైర్ అయినా వదిలి పెట్టేది లేదు అన్నారు.సొంత డబ్బులతో కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తెచ్చు కోవద్దు అని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన ఇక ఉండేది రెండున్నర సంవత్సరాల మాత్రమేనని, అది దృష్టిలో పెట్టుకొని అధికారులు నిజాయితీగా పనిచేయాలి అని విజ్ఞప్తి చేసారు.  మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న మద్దతు చూడ లేకే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుట్రలకు తెర లేపుతున్నారు అన్నారు.బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని తెలిపారు. 

ఈ కార్యక్రమం లో ఛైర్పర్సన్ అభ్యర్ధిని కాసాని నాగ శేష పద్మ,మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ పూర్వ సభ్యులు జే కేవీ రమణారావు,మండల పరిషత్ పూర్వ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి,మండల కన్వీనర్ జుజ్జూరపు వెంకన్న బాబు,కోటగిరి సీతారామ స్వామి,వగ్గెల పూజ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -