విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగబంధం’. ఈ చిత్ర టీజర్‌ను ఈనెల 15 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఆకట్టుకునే టీజర్ పోస్టర్‌లో ఒక పురాతన ఆలయంలోని రహస్య నిధి చుట్టూ రక్షణగా చుట్టుకుని ఉన్న ఒక మహా నాగుపాము కనిపిస్తుంది. ఇది సినిమాలోని ఆధ్యాత్మిక దైవిక రహస్యాన్ని సూచిస్తుంది. భారత దేశంలోని చారిత్రాత్మక విష్ణు దేవాలయాల నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తుది నిర్మాణ దశకు చేరుకుంది.
ఈ వేసవిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ భారీ పాన్-ఇండియా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్.అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అభిషేక్ నామా, నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, జునైద్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్, ఎడిటర్: ఆర్‌సి ప్రణవ్, సీఈఓ: వాసు పోతిని.
మహాశివరాత్రి సందర్భంగా ‘నాగబంధం’ టీజర్ రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



