చంద్రహాస్ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్గా నటించారు. అర్జున్ మహీ (”ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ మూవీని ఈ నెల6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు జయంత్ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ,’ధవన్ చాలా టాలెంటెడ్. ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని అందించాడు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిన్ని, చందు, వెంకీకి, ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి కారణమైన కెమెరామెన్ శేఖర్‌కి థ్యాంక్స్. ఈ సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు అలా కూర్చుని చూస్తుండిపోతారు.
సంపత్ ఈ మూవీని గొప్పగా తీశారు. నన్ను బాగా చూపించారు’ అని అన్నారు. ‘ఈ సినిమాతో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఆది సాయి కుమార్ అన్నారు. జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ,’ఈ టైటిల్లోనే యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, పొగరు ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. సంపత్ రుద్ర మాట్లాడుతూ, ‘నిర్మాత వెంకీ నా క్లాస్ మేట్. అతను లేకపోతే ఈ చిత్రం లేదు. చందు, చిన్ని తరువాత ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటి వరకు ఇలాంటి ఓ కమర్షియల్ చిత్రం రాలేదు. క్లైమాక్స్ చూసి అందరూ షాక్ అవుతారు. ఆ షాక్ నుంచే థియేటర్ నుంచి బయటకు వస్తారు’ అని తెలిపారు. ‘నాకు బుజ్జి లాంటి మంచి పాత్రను ఇచ్చిన సంపత్‌కి థ్యాంక్స్. చంద్రహాస్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ధవన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది’ అని మేఘన ముఖర్జీ చెప్పారు.
ఊహించలేనన్ని ట్విస్టులతో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



