తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘వన్ బై ఫోర్’. పళని కె దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అన్ని సెంటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్‌మీట్‌ను ఫిలింఛాంబర్లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ,’మా సినిమాను ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ చేశారు. ప్రతి థియేటర్లో కలెక్షన్స్ బాగున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికి కూడా మంచి విజయం అందిస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు’ అని తెలిపారు. ‘ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ ఉన్న మా సినమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటం వల్లే ఈ విజయం దక్కింది. బ్లాక్ మెయిలింగ్ వల్ల ఓ మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది మా సినిమాలో చూపించాం. ఈ సినిమా మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది.
మా చిత్రానికి హీరోయిన్స్ నుంచి ప్రమోషన్ కోసం సపోర్ట్ లభించకపోవడం బాధగా ఉంది. హీరోయిన్స్ ప్రమోషన్‌కు రాకుండా సినిమాకు నష్టాన్ని తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించినా వారు సినిమా పట్ల కృతజ్ఞత చూపించలేదు’ అని ప్రొడ్యూసర్ రంజన రాజేష్ గుంజల్ చెప్పారు. ప్రొడ్యూసర్ రోహిత్ రాందాస్ గుంజల్ మాట్లాడుతూ,’మా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది. మేము ఈ చిత్రం ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. కలెక్షన్స్ బాగున్నాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ మోసం చేయరు. కానీ మా చిత్రంలోని నటీనటులే ప్రమోషన్‌కు రాకుండా ఇబ్బందిపెట్టారు. లేకుంటే మా సినిమా మరింతగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేది’ అని తెలిపారు. హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ,’ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. బయట ఇండస్ట్రీలోని ఇతర పెద్ద సినిమాల వల్ల రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ మా ప్రొడ్యూసర్స్ పట్టుదలగా ఈ అడ్డంకులన్నీ దాటుకుని సినిమాను విడుదల చేశారు. అన్ని థియేటర్స్ నుంచి మంచి టాక్ ఉంది. మహిళలు చూడాల్సిన చిత్రమిది. మంచి సినిమా చేశారని అంటున్నారు’ అని చెప్పారు.
ప్రేక్షకులు మా సినిమాను బ్లాక్‌బస్టర్ చేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



