Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్‌ కేటాయింపులు

సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్‌ కేటాయింపులు

- Advertisement -

టీఎస్‌ యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్‌ విమర్శించారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం రూ.1,28,650 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.1,39,289 కోట్లు కేటాయించారని తెలిపారు. అంకెల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం బడ్జెట్‌ దామాషాలో తక్కువగానే ఉంటుందని వివరించారు. పెరిగిన ధరలతో పోలిస్తే మధ్యాహ్నం భోజనం, సమగ్ర శిక్షకు కేటాయించిన బడ్జెట్‌ ఏమాత్రం సరిపోదని చెప్పారు. జాతీయ విద్యా కమిషన్‌ సిఫారసు చేసిన విధంగా బడ్జెట్లో 10 శాతం, జీడీపీలో 6 శాతం కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడానికి వీలుగా బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని వారు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు ఊరట లభించలేదని చావ రవి, ఎ.వెంకట్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం తీసుకువచ్చిన ఆదాయ పన్ను చట్టం ప్రకారమే పన్ను శ్లాబులు ఉంటాయని ప్రకటించటం అన్యాయ మని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితినీ,సేవింగ్స్‌ మొత్తాలపై రిబేటును పెంచలేదని వారు గుర్తుచేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ, కొత్త విధానాన్ని ప్రోత్సహించడా నికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వారు విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -