– సన్‌రైజ్ రంగాలకు సులభంగా నిధుల కల్పన
ముంబయి : దేశ ఆర్థిక గమనాన్ని మార్చగల ‘సన్‌రైజ్’ రంగాలకు వెన్నుముకగా నిలిచేందుకు ఎస్‌బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికత, సుస్థిరత ఆధారిత రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చక్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ముంబయిలో ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు, ఎస్‌బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి సమక్షంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఎదుగుతున్న దశలో ఉండి.. భవిష్యత్తులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న రంగాలను సన్‌రైజ్ సెక్టార్‌లుగా భావిస్తున్నారు.
రాబోయే 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఎనిమిది కీలక రంగాలకు సుమారు రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని బ్యాంక్ అంచనా వేస్తోంది. నాలెడ్జ్ షేరింగ్, ప్రాజెక్ట్ అప్రైజల్, పాలసీ సంప్రదింపులను ఒకే చోటికి చేర్చే చక్ర భారత పురోగతిని వేగవంతం చేసే ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని ఎం నాగరాజు పేర్కొన్నారు. ”భవిష్యత్తులో దేశ వృద్ధికి నూతన కల్పనలు, అధునాతన తయారీ రంగాలే కీలకం. క్లైమేట్ ఫైనాన్స్, కొత్త తరం టెక్నాలజీలకు ఎస్‌బిఐ మరింత మద్దతును అందించనుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక భాగస్వామిగా ఎదిగేందుకు ఇది తోడ్పడుతుంది” అని ఎస్‌బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు.
ఎస్‌బిఐ ‘చక్ర’ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -



