భారత ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు

భారత ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు– బిజినెస్‌ సమ్మిట్‌లో మంత్రి పియూష్‌ గోయల్‌
హైదరాబాద్‌ : రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కనుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. వినియోగదారుల కోసం నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి సారించేందుకు ప్రభుత్వ నిబద్ధతతో ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బిజినెస్‌ కమ్యూనిటీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలకు పన్ను విధింపు అంశాలపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ దుర్వినియోగం కాకుండా ప్రజలకు మరియు వ్యాపార రంగాలకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ బిజెపి సమన్వయకర్త మురళీధర్‌ రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ నవనీత్‌ సింగ్‌, చీఫ్‌ కన్వీనర్‌ దీపక్‌ దాదు తదితరులు పాల్గొని మాట్లాడారు.

Spread the love