Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యారంగానికి కేంద్రం మరోసారి మొండిచేయి

విద్యారంగానికి కేంద్రం మరోసారి మొండిచేయి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగంపై కేంద్ర బిజెపి ప్రభుత్వాము మరోసారి నిర్లక్ష్యం వైఖరినీ ఖండిస్తూ పిడిఎస్యు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా  జిల్లా కార్యదర్శి యస్ దుర్గా ప్రసాద్ ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ లు మాట్లాడుతూ.. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను పిడిఎస్యు విద్యార్థి సంఘంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర బడ్జెట్ మొత్తం రూ.53.5 లక్షల కోట్లు అందులో విద్యారంగానికి కేవలం 1.39 లక్షల కోట్లు అంటే దాదాపు 2.6% మాత్రమే కేటాయించడం దుర్మార్గమున్నారు. దేశ భవిష్యత్తును మార్చే విద్యారంగాన్నీ కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య చేయడం సిగ్గుచేటన్నారు.

పాఠ్యాంశాలను తొలగిస్తూ ఆర్ఎస్ఎస్ మనోభావాలను తీసుకొస్తూ విద్యారంగాన్ని శాస్త్రీయ దృక్పథం లేకుండా మూఢనమ్మకాలతో, అవిశ్వాసాలతో విద్యార్థుల మెదడులను తుప్పు పట్టిస్తున్నారన్నారు. యూనివర్సిటీలలో చదివే విద్యార్థులకు ఫెలోషిప్లు పెంచక ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా, తెలంగాణ రాష్ట్రానికి సైనికు స్కూల్ ఇవ్వకుండా, విద్యార్థులను స్కిల్స్ డెవలప్మెంట్ చేయకుండా నామమాత్రపు చదువులతో విద్యార్థులను అగమ్యగోచరంలోని నెట్టి వేయబడుతున్నరన్నారు.

ఈ బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రెగ్యులర్ కోర్సులు అందించకుండా సెల్ ఫైనాన్స్ పేరుతో విద్యార్థులను ఫీజులలో కట్టించుకునే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులను విద్యకు దూరం చేసే ఆలోచనలో భాగంగా ఈరోజు కేంద్ర బిజెపి ప్రభుత్వం పేద విద్యార్థులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్ లో 30% నిధులను కేటాయించాలన్నారు. ముఖ్యమంతి, మంత్రులు తెలంగాణ యూనివర్సిటీ సందర్శించి అబివృద్ధి కోసం రూ.200 కోట్ల నిధులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  పీడీఎస్యూ ఏరియా నాయకులు నిఖిల్, చరణ్  , చారి, యశ్వంత్, ఆనంద్, మనోజ్ భాను లోహిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -