- Advertisement -
ఇద్దరికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ – తాడూర్
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా పడిన ఘటన మంగళవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాగంపల్లి సమీపంలో 167 హైవేపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి కారు బోల్తా పడింది. అటుగా వెళ్తున్న స్థానికులు కారులో ఉన్న వ్యక్తిని, బైక్ పై నుంచి కింద పడి తీవ్ర గాయాల పాలైన ఇద్దరినీ నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



