జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల నియమనిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీ లో పీఓ, ఏపీ ఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.
పీఓ, ఏపీ ఓ లు ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్స్, , ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు, ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశా లు వివరించారు. పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఆర్.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామలింగం, పి. ఓ, ఏ పి ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



