Tuesday, February 3, 2026
E-PAPER
Homeజిల్లాలుకూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

కూలీల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

- Advertisement -

విబిజి రామ్ జిని రద్దు చేయాలని ఆందోళన
ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉపాధిహామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ అన్నారు. టిపిసిసి అధ్యక్షుడు కుమార్ గౌడ్, సిఎం రేవంత్ రెడ్డి సూచన, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అధ్యక్షతన సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎంపిడిఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన, ధర్నా చేపట్టి గాంధీ విగ్రహనికి పాలాభిషేకం చేసి, నివాళులర్పించారు.

అనంతరం మండల ఎంపిడిఓ క్రాoతికుమార్ కు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజి రామ్ జి అనే పథకాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గపు చర్యన్నారు. వెంటనే రద్దు చేసి గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ చైర్మన్ పంథకాని తిరుమల-సమ్మయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్ లు బండి స్వామి, మేకల రాజయ్య, బండారి నర్సింగం, గడ్డం క్రాంతి, కొండ రాజమ్మ, జంగిడి శ్రీనివాస్, చంద్రగిరి సంపత్, అబ్బినేని లింగస్వామి యాదవ్, ఉప సర్పంచ్ లు బొబ్బిలి రాజు గౌడ్, అక్కల దేవేందర్ యాదవ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు చెంద్రయ్య, సారయ్య, జంబోజు సంధ్యరాణి-రవిందర్, కాంగ్రెస్ నాయకులు అంగోతు సుగుణ, జంపయ్య నాయక్, రాహుల్, రాజశేఖర్, రాజా సమ్మయ్య, చెంద్రయ్య, అశోక్ రావు, చిగురు సదయ్య, బండి రాజయ్య, దుర్గాప్రసాద్, రాగం రమేష్, సురేష్ రావు, సతీష్, రణదీర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -