Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం 

ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం 

- Advertisement -

సీపీఐ, సీపీఐ(ఎం) లకు కో ఆప్షన్లు 
నాలుగవ వార్డులో సీపీఐ(ఎం) కాంగ్రెస్ స్నేహ పూర్వక పోటీ : ప్రభుత్వ విప్ బీర్ల 
నవతెలంగాణ – ఆలేరు 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య తెలిపారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం  ఆ పార్టీ నుండి పోటీ చేస్తున్న 12 మంది కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మాట్లాడారు. తొమ్మిదేళ్లు బిఆర్ఎస్ పాలనలో నూతన మున్సిపాలిటీలు ప్రకటించారు. అభివృద్ధిని మరిచారు. ప్రజలకు ఇంటి పన్నులు ఇతర పనులన్నీ పెరిగాయి అభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. మిగులు  బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఏర్పాటు చేసిందన్నారు. కెసిఆర్ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఆలేరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడాను. దేవాలయంతో సమానమైన అసెంబ్లీలో మాట్లాడిన విధంగానే ఆలేరుని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే వరకు శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. ఆలేరు పట్టణ సమగ్ర అభివృద్ధి సిసి రోడ్లు మురికి కాలువలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వీధిలైట్లు త్రాగునీరు కోసం 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 

సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలకు యాదిగిరి గుట్ట ఆలేరులో ఒక్కొక్క కో ఆప్షన్  ఇస్తున్నట్లు చెప్పారు. ఆలేరులోని మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సందుల సురేష్ మద్దతుగా సీపీఐ(ఎం) పార్టీకి చెందిన మొరిగాడి రమేష్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు చెప్పారు. నాలుగో వార్డుల మాత్రం సీపీఐ(ఎం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యన స్నేహ పోటీ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు బీఫామ్ తీసుకొని గెలుపు కోరుతూ పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిపి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీర సారపు యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర రాజు పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, ఆలేరు మాజీ సర్పంచ్ అకవరం మోహన్ రావు, మహిళ అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, ఎంఎస్ విజయకుమార్ కట్టెగుముల సాగర్ రెడ్డి, ఎండి జైనువుద్దీన్ ఎండి సలీం, ఎండి బాబా మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -