Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమున్సిపల్ ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు

మున్సిపల్ ఎన్నికలు : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణకు గడువు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్లు ఉపసంహరణకు గడువు ముగిసింది. మంగళవారం సాయంత్రం 3 గంటల వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది.

మెుత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. రిటర్నింగ్ అధికారులకు సహకరించాలని పార్టీలను కోరారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -