Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలి 

క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలి 

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకుంటే భవిష్యత్తులో స్థిరపడతారని బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు అన్నారు. మండలంలోని వేముల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల క్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ పవర్ ప్యాడులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారని, వారి విద్య బలోపేతానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాదమ్మ, సోషల్ మీడియా మండల అధ్యక్షులు భీమ్ రాజ్, వార్డు సభ్యుడు గోపాల్ నాయక్ పాఠశాల, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బాల్య నాయక్ ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -