Tuesday, February 3, 2026
E-PAPER
Homeఖమ్మంఏకకాలం లెక్కింపు

ఏకకాలం లెక్కింపు

- Advertisement -

– త్వరితగతిన తుది లెక్కింపు
– ముందుగా పేట రిజల్ట్ ప్రకటించే లా కార్యాచరణ
– పోలింగ్ సామాగ్రి పంపిణీ,ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

జిల్లాలో అశ్వారావుపేట మున్సిపాల్టీ ఎన్నికల రిజల్ట్ ముందుగా ప్రకటించే లా కార్యాచరణ చేపట్టాలని మున్సిపాల్టీ ఎన్నికల జిల్లా అధికారి,కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. అశ్వారావుపేట లోని వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మున్సిపాల్టీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి నిల్వ చేసిన స్ట్రాంగ్ రూం,పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రదేశం,ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఎన్నికల ప్రత్యేక అధికారి అమయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. 

ఈసందర్భంగా ఏకకాలం లో,సకాలంలో అన్ని వార్డుల ఓట్లు లెక్కింపు అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని,అదనపు సదుపాయాలు కల్పించుకోవాలని మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి,స్థానిక మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ హేమంత కుమార్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -