Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దృష్టులను కాపాడితే అడ్రస్ గల్లంతే: మందకృష్ణ మాదిగ

దృష్టులను కాపాడితే అడ్రస్ గల్లంతే: మందకృష్ణ మాదిగ

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
కర్ల రాజేష్ మృతికి కారణమైన దోషులను కాపాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల రెండు నియోజకవర్గాల అడ్రస్ గల్లంతు కాక తప్పదని యంఆర్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సభ అధ్యక్షులు చెడుపాక గంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కర్ల రాజేష్ సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు అమాయకుడైన కర్ల రాజేష్ ఎలాంటి తప్పు చేయకుండా,అక్రమ నిర్భంధం చేసి కేసులు నమోదు చేసి పోలీసులు చిత్రహింసలకు గురి చేసి లాకప్ డెత్ కి కారణమైన ఎస్ఐ సురేష్ రెడ్డి ని కాపాడటం వెనుక ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నదని చెప్పారు.

రాజేష్ చనిపోయి సుమారు మూడు నెలలు గడుస్తున్నప్పటికి,ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.ఆధారాలు లేకుండా పిర్యాదు చేయకుండా అక్రమ నిర్భంధంతో రాజేష్ మృతికి పోలీసులు భాద్యత వహించాల్సి వస్తుందని చాల జగ్రత్తగా పోస్టు మార్టం రిపోర్ట్ను సైతం తమకు అనుకూలంగా మలుచుకునే విదంగా కేసును తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర మంత్రి కోదాడ ఎమ్మెల్యే సహకారంతో ఈతంతు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని రీ పోస్ట్మార్టన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ మృతి ఏరాజకీయ పార్టీలకు పట్టడం లేదని కేవలం మాదిగల ఓట్లు మాత్రమే కావలి మాదిగలు జెండాలు పట్టాలి జై కొట్టాలా అని ఏద్దేవా చేశారు. జాతి కోసం ఎక్కడి దాకానైనా కొట్లడతాం, కానీ ఆత్మ గౌరవం తాకట్టు పెట్టేది లేదన్నారు. అంతకుముందు ప్రజాయుద్ధనౌక ఏపూరి సోమన్న మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన మందకృష్ణ మాదిగ ద్వారానే సాధ్యమైందని, కులం పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డ మాదిగలు నేడు ప్రతి పేరు చివరన మాదిగ పెట్టుకోవడానికి కారణం కృష్ణన్నని అన్నారు.

దళిత జాతిని ఏకం చేసి, చెప్పులు కుట్టిన చేతులతోనే మరోచరిత్ర సృష్టించాడని అన్నారు. దళితులంతా బలిచ్చే మేకలలాగా కాకుండా, గర్జించే సింహం లాగా ఉండాలని అన్నారు. ఆస్తిపాస్తులు లేకున్నా ఆత్మగౌరంతో బతికేవారు మాదిగల అని అన్నారు. పార్టీలకు అతీతంగా సబ్బండ జాతులను కాపాడేది మందకృష్ణ అన్న అని అన్నారు. తన ఆటపాటలతో మాదిగ జాతి ఐక్యం కోసం అనేక సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాటికొండ సీతయ్య, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం కాశీo,స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా,రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్,తడకమల్ల రవికుమార్,ఎమ్మార్పీఎస్ నాయకులు కొండగడుపుల శ్రీను,మండల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -