Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్లమెంట్ మార్చ్ జయప్రదం చేయాలి

పార్లమెంట్ మార్చ్ జయప్రదం చేయాలి

- Advertisement -

డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిలుపు
న‌వ‌తెలంగాణ‌ – భూపాలపల్లి :
ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ,విద్యాలయం సమస్యలు పరిష్కరించాలని ఈ నెల‌ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అశోక్ ఏ తిరుపతి లు కోరారు. వారు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయింపు నివ్వాలని, ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎంఎల్సి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వాడుకోవద్దని, ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ను సకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -