హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా నాయిక కయదు లోహర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత ఆడియెన్స్‌లో పెరిగిన ఆమె క్రేజ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ఈ చిత్ర మోషన్ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 9న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా కనిపించ నున్నారు. దీంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్ – రషీద్ అహ్మద్, ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్, ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్, సినిమాటోగ్రఫీ – టిజో టోమీ, మ్యూజిక్ – జేక్స్ బిజోరు, స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్, ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్, డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ.
పీరియాడిక్ నేపథ్యంలో..
- Advertisement -
- Advertisement -



